Deepika Padukone |గత ఏడాది సెప్టెంబర్లో ఓ ఆడబిడ్డకు దీపికా పదుకొణె జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మగా తాను అనుభవిస్తున్న మాతృత్వానుభవాల గురించి దీపిక మాట్లాడారు. ‘తల్లిగా నేను అనుభవిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్థానం ఇది. గర్భిణిగా ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. ముఖ్యంగా 8,9 నెలల్లో అయితే చాలా కష్టం అనిపించింది. ఆ సమయంలో నాకు అండగా నా కుటుంబం, స్నేహితులు ఉండటం వల్లే ధైర్యంగా బిడ్డకు జన్మనివ్వగలిగాను.
మా అమ్మాయికి మంచి పేరు కోసం అన్వేషించాం. చివరకు ‘దువా’ అని నామకరణం చేశాం. ‘దువా’ అంటే ప్రార్థన అని అర్థం.’ అని తెలిపారు దీపిక. ఇంకా చెబుతూ ‘ఓ వైపు తల్లిగా ఉండి, మరోవైపు షూటింగ్లలో పాల్గొనడం నాకు పెను సవాలుగా మారింది. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ.. సినిమాను పక్కనపెడితే కెరీర్ పాడవుతుంది. అందుకే.. ఇక షూటింగులపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే షూటింగుల్లో పాల్గొంటా.’ అని తెలిపారు దీపిక పదుకొణె.