Kalki 2- Deepika Padukone |టాలీవుడ్ నుంచి రాబోయే ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌లలో కల్కి 2 ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా.. దీపికా పదుకొనే, దిశా పటాని కథానాయికలుగా నటించారు. కమల్ హాసన్ విలన్‌గా నటించగా.. అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డేట్స్ లేకపోవడంతో తప్పుకుంటుంది అని కొన్ని మీడియాలు పేర్కొనగా మరికొన్ని మీడియా సంస్థలు వ్యక్తిగత కారణాలతో తప్పుకోబోతున్నట్లు వెల్లడించాయి. అయితే దీనిపై నిర్మాణ సంస్థ స్పందించాల్సి ఉంది.