Prakash Raj In OG | పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగాసినిమాలో నటించిన ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్ రాజ్ ఇందులో సత్యదాదా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రకాశ్ రాజ్ – పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ఓజీలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ షాక్‌కి గురయ్యారు.
Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025