బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు దీపికా తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ హిట్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2). అయితే ఈ సినిమా విజయంపై దీపికా మౌనంగా ఉండటం, సినిమా స్క్రీనింగ్‌కు హాజరుకాకపోవడం, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో.. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? లేదా ఆమె కావాలనే మౌనంగా ఉందా? అనే చర్చ నెట్టింట మొదలైంది. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించింది దీపికా.
ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కి ఆమె స్పందిస్తూ.. “నా మౌనం గురించి ఇంటర్నెట్ అతిగా ఊహించుకుంటోంది. నిజానికి మీ అందరికంటే ముందే నేను ఆ సినిమా చూశాను. ఇప్పుడు చెప్పండి.. జోక్ ఎవరి మీద? అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే దీపికా పోస్ట్‌కి నెటిజన్లు మద్దతు తెలుపుతూ.. ఆమె రణవీర్ భార్య, ఆయనతోనే కలిసి ఉంటారు.. సినిమా చూడటానికి ఆమెకు థియేటర్ లేదా సోషల్ మీడియా అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా, రణవీర్ 2018లో వివాహం చేసుకోగా, వీరికి 2024 సెప్టెంబర్‌లో ‘దువా’ అనే కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది విడుదలైన ‘ధురంధర్’కు సీక్వెల్. ఇందులో రణవీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించగా, యామీ గౌతమ్ అతిథి పాత్రలో మెరిశారు.