Deepika Padukone | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో ఒకరు దీపికాపదుకొనే (Deepika Padukone). బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ భామ త్వరలోనే తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బేబిబంప్తోనే సింగం అగెయిన్ షూట్లో పాల్గొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది దీపికా పదుకొనే.
ఈ భామ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో హాయిగా నవ్వుతున్న స్టిల్‌తోపాటు బేబిబంప్ ఫొటోను కూడా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది దీపికా పదుకొనే. ఒకే చాలు.. నాకిప్పుడు ఆకలిగా ఉంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. కల్కి సినిమా విజయం సాధించాలి. మీ కొత్త చాప్టర్.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సింగం అగెయిన్లో దీపికాపదుకొనే శక్తి శెట్టిగా కనిపించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇన్‌స్టా పోస్ట్‌లో ఇలా..
శక్తి శెట్టిగా దీపికాపదుకొనే లుక్..