అగ్ర తారలు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె దంపతులు తమ ముద్దుల తనయ దువా పదుకొణె సింగ్‌ను దీపావళి సందర్భంగా తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశారు. దీపావళి సెలబ్రేషన్స్ తాలూకు ఫొటోలను ఈ జంట తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.
ఇందులో చిన్నారి దువా పదుకొణె సింగ్ ఫొటోలను కూడా షేర్ చేశారు. చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా కనిపిస్తున్న చిన్నారి దువా ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రణ్వీర్, దీపికా దంపతులు గత ఏడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రులయ్యారు. అయితే ఇప్పటివరకు తమ కుమార్తె తాలూకు ఫొటోలను ఎక్కడా బయటపెట్టలేదు. దీపావళిని పురస్కరించుకొని తొలిసారిగా తమ గారాల తనయ ఫొటోలను షేర్ చేయడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.