సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె కథనందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకుడు. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ఇది. ఓ జంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా మెప్పిస్తుంది. మంచి సందేశం కూడా ఉంటుంది ’ అన్నారు.
ఇవి కూడా చదవండి.
సామాన్యుడి ‘పరాక్రమం’
స్వీయ దర్శకత్వంలో బండి సరోజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరాక్రమం’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను హీరో సందీప్‌కిషన్ ఆవిష్కరించారు. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ ‘కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యే కథాంశమిది.ఈ కథ మనల్ని మనం తెరపై చూసుకున్న అనుభూతినిస్తుంది’ అన్నారు. బండి సరోజ్‌కుమార్ అద్భుతమైన ప్రతిభావంతుడని, అతని వ్యక్తిత్వం కూడా గొప్పదని సందీప్‌కిషన్ ప్రశంసించారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకుడు: బండి సరోజ్‌కుమార్.
క్రీడా నేపథ్యంలో..
సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న చిత్రం ‘జీరో’. లక్ష్మీనారాయణ సి దర్శకుడు. ఆర్.లక్ష్మణ్‌రావు, ఆర్.శ్రీను నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ ప్రకటనతో పాటు గ్లింప్స్‌ని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. లవ్, ఫ్యామిలీఎమోషన్స్ ప్రధానంగా స్పోర్ట్స్ నేపథ్య కథాంశమిదని దర్శకుడు తెలిపారు.
జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో స్పోర్ట్స్ ఆడే ఉంటారని, వారందరికి స్ఫూర్తినిచ్చే ఇతివృత్తమని నిర్మాతలు పేర్కొన్నారు. స్ఫూర్తివంతమైన కథగా ఆకట్టుకుంటుందని హీరో విజయ్‌రాజా అన్నారు. రాజేంద్రప్రసాద్, ఆమని, శివాజీరాజా, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.