Deadpool & Wolverine | హాలీవుడ్ నుంచి డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ చిత్రం మార్వెల్ & డెడ్‌పూల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాగా.. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో రూ. 3650 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. 2024లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నం.1 చిత్రంగా డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ నిలిచింది. మరోవైపు ఇండియాలో మూడు రోజుల్లో రూ.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమాలో వోల్వారిన్గా హ్యూగ్ జాక్మాన్, డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ నటించారు. ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా.. షాన్ లెవీ దర్శకత్వం వహించాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
#DeadpoolAndWolverine has taken the BO by storm with a staggering Rs. 3650 crores in its opening weekend, making it the number 1 opening film of 2024.
In India, the film has collected a whopping *Rs. 83.28 cr* crore in its first weekend crossing the lifetime collection of both… pic.twitter.com/FqpYXaXYtm
— Ramesh Bala (@rameshlaus) July 29, 2024
Also read..