Pelli Choopulu | ‘పెళ్ళి చూపులు’ సినిమాకు 8 ఏళ్లు… రూ.1 కోటి పెడితే ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?
Pelli Choopulu | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్గా తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెళ్ళి చూపులు’. 2016 లో జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం (Pelli Choopulu) బాక్పాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
Pelli Choopulu | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్గా తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెళ్ళి చూపులు’. 2016 లో జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం (Pelli Choopulu) బాక్పాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం రూ.1 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.39 కోట్లు వరకు వసూళ్లను రాబట్టింది. నటుడిగా స్ట్రగుల్ అవుతున్న టైంలో విజయ్ దేవరకొండ కెరీర్‌కు మంచి హిట్‌ను అందించింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం విడుదలై నేటికి 8 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ ఎక్స్‌లో నెటిజన్లు కల్ట్, క్లాసీక్, మదర్ అఫ్ న్యూ ఏజ్ తెలుగు సినిమా అంటూ ప్రత్యేక పోస్ట్‌లు పెడతున్నారు.
ఈ సినిమాతోనే నటుడు విజయ్ దేవరకొండతో పాటు రీతూ వర్మకు, ప్రియదర్శి (Priya Darshi)కి, తరుణ్ భాస్కర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మూవీకి సంబంధించి నటీనటుల నాచ్యురల్ పర్ఫార్మెన్సెస్, తరుణ్ భాస్కర్ టేకింగ్, డైలాగ్స్ సినిమాను భారీ విజయం సాధించేలా చేశాయి. ఈ చిత్రంలోని ‘నా సావు నేను సస్తా’ అనే ఫేమస్ డైలాగ్ ఇప్పటికి యూత్ వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ చిత్రానికి ‘బెస్ట్ తెలుగు ఫిలిం’ మరియు ‘బెస్ట్ స్క్రీన్ ప్లే’ కేటగిరీల్లో రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.
8 years of @thedeverakonda & #PelliChoopulu magic ✨#VijayDeverakonda pic.twitter.com/EEjUhZiiJ4
— Vijay Deverakonda FC (@TeamVDFC) July 29, 2024
8 years of Pelli Choopulu magic! ✨#PelliChoopulu @TheDeverakonda @riturv pic.twitter.com/kwzIHJYWPO
— Suresh PRO (@SureshPRO_) July 29, 2024
8 years of Pelli Choopulu magic! ✨#PelliChoopulu @TheDeverakonda @riturv #8yearsofpellichoopulu ❤️🔥 pic.twitter.com/JEbgcOhVNE
— THE Aravind Chinna (@ARAVIND__vd) July 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

