పాపులర్ కమెడియన్ సంతానం హీరోగా, సురభి హీరోయిన్గా తమిళంలో నటించిన చిత్రం ‘డీడీ రిటర్న్స్’. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో సి.రమేష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ పేరుతో ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంతానం మాట్లాడుతూ ‘నా సినిమాను తెలుగులో విడుదల చేయాలనేది నా కోరిక.
మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూశాను. ఇన్నాళ్లకు ఈ సినిమాతో ఆ కల తీరుతుంది.అందరూ కడుపుబ్బా నవ్వుకునే చిత్రమిది. రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ హారర్ కామెడీ విత్ గేమ్‌తో వున్న ఈ సినిమా పిల్లలకు కూడా నచ్చుతుంది.కాన్సెప్ట్ కూడా యూనిక్‌గా వుంటుంది. ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుందని హీరోయిన్ సురభి తెలిపారు.