సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్ జంటగా నటిస్నున్న చిత్రం ‘దూరదర్శని’. కార్తికేయ బొమ్మి దర్శకుడు. మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నన్నపనేని, కోటేశ్వరరావు బొమ్మిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. రెట్రో లుక్‌లో వున్న తమ చిత్రం ఫస్ట్‌లుక్‌కు అందరి నుంచి చక్కని స్పందన వస్తోందని, వైవిధ్యమైన చిత్రాలు ఆదరించే ప్రేక్షకులకు ‘దూరదర్శని’ తప్పక నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సమర్పణ: బేబి రియాంషిక, సంగీతం: ఆనంద్ గుర్రాన, రైటర్: నారాయణ ఆవుల.