‘పుష్ప’ పాన్ఇండియా సినిమాగా విడుదలై రికార్డుల్ని కొల్లగొట్టింది. డిసెంబర్ 6న దానికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ రానుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టేందుకు దర్శకుడు సుకుమార్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో సుకుమార్ ఓ అతిధి చేయిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది.
అంతేగాక, డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నది. అది ‘పుష్ప 2’ లోనిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్‌కి డెవిడ్ వార్నర్ అభిమాని. బన్నీ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు వార్నర్ మరింత చేరువయ్యారు. ఇప్పుడు ‘పుష్ప 2’లో ఆయన చేస్తున్న మాట నిజమే అయితే.. ఈ సినిమా ప్రత్యేకతల్లో వార్నర్ చేస్తున్న పాత్ర కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు.