David Warner | తెలుగు సినిమా స్థాయి పెరగడంతో ఇతర దేశాలకి చెందిన నటీనటులు కూడా మన తెలుగు సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా లవర్ బాయ్ నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో డేవిడ్ వార్నర్ ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయబోతున్నారు. వార్నర్ ఐపీఎల్లో కొన్నేళ్లపాటు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఆడడం వల్ల తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అంతే కాక తెలుగు సినిమాల్లోని పలు డైలాగ్స్, పాటలకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, వాటకి టాలీవుడ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం మనం చూశాం. ఈ క్రమంలోనే వార్నర్- తెలుగు ఆడియెన్స్‌కు మంచి బాండింగ్ ఏర్పడింది.
ఇప్పుడు వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నాడు అనే సరికి ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో డేవిడ్ వార్నర్ సందడి చేశారు. ఇక ఈవెంట్లో వార్నర్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను బిగ్ స్క్రీన్‌పై ప్లే చేశారు. ఇందులో వార్నర్ సన్‌రైజర్స్‌కు ఆడిన ఇన్నింగ్స్‌ను హైలైట్ చేస్తూ చూపించగా, అది చూసి వార్నర్ కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీమ్‌తో కలిసి ఆయన డ్యాన్స్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు వార్నర్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక ఈ కార్యక్రమంలో డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. స్టేజ్ పైనే అందరి ముందే.. డేవిడ్ వార్నర్ ని రేయ్ అంటూ తిట్టేశారు రాజేంద్రప్రసాద్. క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ సరదాగా కామెంట్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌కి వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇక ‘భీష్మ’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ‘రాబిన్ హుడ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
The stars of #Robinhood – @actor_nithiin, @sreeleela14, @davidwarner31 & @TheKetikaSharma – dance to the trending chartbuster #AdhiDhaSurprisu at the #Robinhood trailer launch & Grand Pre-Release Event 💥💥❤️🔥
Watch Live now!
▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now… pic.twitter.com/mmISnN1ula— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025