David Reddy | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం డేవిడ్ రెడ్డి ఇప్పుడు కొత్త అప్డేట్తో వార్తల్లో నిలిచింది. దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా సినిమా ఇంటర్వెల్ భాగాన్ని మరింత ఎఫెక్టివ్‌గా మార్చేందుకు రీషూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రీషూట్‌లో మంచు మనోజ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొననున్నారు. కథలో కీలక మలుపు ఇచ్చే ఈ ఇంటర్వెల్ సీన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలపై టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందు ప్రతీ అంశాన్ని పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ పనిచేస్తున్నారు. ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికి వస్తే, ఇది స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ధైర్యవంతుడు ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. దేశభక్తి, యాక్షన్, భావోద్వేగాలు కలగలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణగా ‘వార్ డాగ్’ అనే భారీ బైక్ నిలవనుంది. దాదాపు 700 కేజీల బరువున్న ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లలో ఇది కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా మరియా నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో ముఖ్యమైన భాగంగా ఉండనుందని టాక్. మొత్తానికి ‘డేవిడ్ రెడ్డి’ సినిమా భారీ స్థాయిలో రూపొందుతూ, మంచు మనోజ్ కెరీర్లో ఒక ప్రత్యేక చిత్రంగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.