హైదరాబాద్: ముస్లిం కావడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహ్మాన్ ఇద్దరు కూతుళ్లు స్పందించారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్‌కు వాళ్లు మద్దతు పలికారు. తమ తండ్రితో మీరు విబేధించవచ్చు అని, కానీ ఆయన తన అనుభవాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను హరించలేరని వాళ్లు పేర్కొన్నారు. ఏఆర్ రెహ్మాన్ కూతుళ్లు ఖటిజా, రహీమా.. తమ ఇన్‌స్టా స్టోరీల్లో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మలయాళం మ్యూజిక్ కంపోజర్ కైలాశ్ మీనన్ రాసిన పోస్టును రెహ్మాన్ కూతుళ్లు రీ-పోస్టు చేశారు. వ్యతిరేకించండి, కానీ అవమానించకండి అంటూ మీనన్ ఓ నోట్ రాశారు. ఆ నోట్‌నే రెహ్మాన్ కూతుళ్లు తమ సోషల్ మీడియాలో మళ్లీ పోస్టు చేశారు.