Cinema Bandi | ‘సినిమా బండి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పరదా’. అనుపమా పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ఇందులో ముఖ్యపాత్రధారులు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్ వీడియోకి మంచి స్పందన వచ్చిందని, ఇందులో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న దర్శన రాజేంద్రన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన ఆమె లుక్‌ని విడుదల చేశామని, ఇందులో ఆమె సివిల్ ఇంజనీర్ ‘అమిష్ట’గా నటిస్తున్నారని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కూడా దర్శన పోషిస్తున్న అమిష్ట పాత్రను మేకర్స్ ప్రజెంట్ చేశారు. ఇందులో ‘అబ్బాయిలు చేయలేనిది.. అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం..’ అంటూ దర్శన చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. అన్ని విధాలుగా సినిమా బావుంటుందని, పాషన్‌తో సినిమా చేశామని, షూటింగ్ పూర్తయిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్‌సేన్, సంగీతం: గోపీసుందర్.