Darling | తనదైన కామెడీ స్టైల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు ప్రియదర్శి. మల్లేశం, బలగం సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇస్మార్ట్ భామ నభా నటేష్ నటించిన తాజా చిత్రం డార్లింగ్ (Darling). అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో ఆగస్టు 13 నుంచి ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. అనన్య నాగళ్ల డాక్టర్‌గా కనిపించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ట్రావెల్ ఏజెన్సీలో పని చేసే రాఘవ (ప్రియదర్శి) అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్‌కు హనీమూన్‌కు వెళ్లాలనుకుంటాడు. తన తండ్రి చూసిన అమ్మాయి సైకాలజిస్ట్ నందిని (అనన్యనాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ నందిని ట్విస్టు ఇస్తూ చివరి నిమిషంలో ప్రేమించిన వాడితో వెళ్లిపోవడంతో వెడ్డింగ్ నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన రాఘవ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టైంలో ఆనంది (నభా నటేష్) అతడి లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ వెంటనే రాఘవ ఆనందికి ప్రపోజ్ చేయడం, ఆ వెంటనే పెళ్లి జరిగిపోతాయి. అయితే ఆనందికి మల్టీఫుల్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ కారణంగా ఆమె చేతిలో దెబ్బలు తింటాడు రాఘవ. ఇంతకీ ఆనందిలో ఉన్న పర్సనాలిటీస్ ఏంటీ.. రాఘవ ఎలాంటి కష్టాలు పడ్డాడనే నేపథ్యంలో సాగేదే స్టోరీ.
Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024
Also Read..
Pinarayi Vijayan | కొండచరియలు విరిగిపడిన ఘటన.. సీఎండీఆర్ఎఫ్కు కేరళ సీఎం విరాళం
Vizag Steel Plant | బతికిస్తున్నారా.. చంపేయాలని చూస్తున్నారా.. కేంద్రంపై షర్మిల ఫైర్