డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రాట్’. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. శశాంక్ దర్శకుడు. మంజునాథ్ కంద్కూర్ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘యుద్ధమే రానీ..’ అంటూ సాగే ఓ పాటను సీనియర్ నటుడు నరేష్ వీకే ఆవిష్కరించారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె రచన చేశారు. సిధ్శ్రీరామ్ ఆలపించారు.
తండ్రీకొడుకుల సంఘర్షణ కథాంశంతో ఈ సినిమా తీశామని, ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించామని, వినూత్న కథతో ఆకట్టుకుంటుందని హీరో డార్లింగ్ కృష్ణ తెలిపారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాత మంజునాథ అన్నారు.