హీరోయిజమైనా, విలనీ అయినా పాత్రలో పరకాయప్రవేశం చేసి విశ్వరూపం చూపించే నటులు కొంతమందే ఉంటారు. వా రిలో సీనియర్ నటులు మోహన్‌బాబు ఒకరు. నాయకుడిగా, ప్రతినాయకుడిగా ఆయన పో షించిన అద్భుత పా త్రలు అందరికి తెలిసివవే. సుదీర్ఘ విరామం తర్వాత మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.
అందుకు ‘ది ప్యారడైజ్’ సినిమా వేదిక అవుతున్నది. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ హైదరాబాద్ నేపథ్య పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శికంజ మాలిక్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో మోహన్‌బాబు కనిపించనున్నారు. శనివారం ఆయన పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గన్, కత్తి పట్టుకొని సిగార్ కాలుస్తూ..చుట్టూ ఆయుధాల నడుమ ఆయన పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘గొప్ప హీరోలతో పాటు గొప్ప విలన్లూ ఉంటారు.
ఈ రెండూ ఆయనే. వాటికంటే ఎక్కువే. ఆయన పేరు శికంజ మాలిక్. చీకటి సామ్రాజ్యాధినేత వస్తున్నాడు. ది లెజెండరీ మోహన్‌బాబుగారు పతాకస్థాయి విలనిజం చూపించడానికి మీ ముందుకువస్తున్నాడు’ అంటూ నాని ఈ పోస్టర్‌పై వ్యాఖ్యానించారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపైస సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.