కన్నడంలో విజయం సాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం తెలుగులో ‘డేంజర్ బాయ్స్’గా రాబోతున్నది. శ్రీరంగం సతీష్‌కుమార్ తెలుగు అనువాద వెర్షన్‌ను అందిస్తున్నారు. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిజిత్ తీర్థహళ్లి దర్శకత్వం వహించారు.
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిదని, గంధపు చెక్కల వేటలో ముగ్గురు స్నేహితులకు అడవిలో ఎదురైన అనుభవాలు థ్రిల్‌ను పంచుతాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, సంగీతం: సునాద్ గౌతమ్.