శ్రీచరణ్ రాచకొండ, గీత్ శైనీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. దామోదర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో కొనసాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్.