Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సీజన్లోకి తాజాగా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్, శ్రీనివాస్ సాయిలతో పాటు టీవీ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా లు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.నాలుగో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా స్టేజ్ మీదకి వచ్చిన నిఖిల్ నాయర్ కు నాగార్జున ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వీడియో మెసేజ్ ద్వారా నిఖిల్‌ను అభినందించడంతో ఆ క్షణం ప్రత్యేకంగా మారింది. ఆ తర్వాత నాగ్, నిఖిల్‌కు ‘పింక్ స్టోన్’ అందజేశారు. దీని ద్వారా నిఖిల్‌కి “ కంటెండర్ పవర్ ” లభించింది. ఈ పవర్‌తో అతను నేరుగా ప్టెన్సీ కంటెండర్ అవ్వొచ్చని నాగార్జున వెల్లడించారు.
ఇక చివరి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా గౌరవ్ గుప్తా హౌస్‌లోకి ప్రవేశించాడు. తెలుగు కొంచెం తక్కువగా మాట్లాడగలిగిన గౌరవ్, స్టేజ్‌పై నాగార్జునతో చక్కటి ఇంటరాక్షన్ సాగించాడు. గౌరవ్‌కి నాగ్ “బ్లెస్సింగ్ పవర్” ఇచ్చారు. ఈ పవర్ ద్వారా హౌస్‌లో ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, అతను నేరుగా బిగ్‌బాస్ సలహా తీసుకునే అవకాశం ఉంటుంది. హౌస్‌లోకి వెళ్లే ముందు, నాగ్ గౌరవ్‌కి కొన్ని కంటెస్టెంట్ల ఫోటోలు చూపించి, “ఫేవరెట్ ఎవరు?” అని అడిగారు. అందులో గౌరవ్ తనూజ పేరు చెప్పాడు. దీంతో నాగ్ ఆ ఫోటో వెనుక ఉన్న నంబర్ ని పుష్అప్స్ చేయమని ఛాలెంజ్ ఇచ్చారు. ఆ నంబర్ 50 కావడంతో గౌరవ్ 50 పుష్అప్స్ పూర్తి చేసి మరీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇలా నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎంట్రీలతో బిగ్‌బాస్ హౌస్‌లో సరికొత్త గేమ్ మొదలు కానుందని అంటున్నారు.ఇక ఈ వారం ఎపిసోడ్లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ చూశారు. ముందుగానే హోస్ట్ అక్కినేని నాగార్జున “డబుల్ ఎలిమినేషన్” అంటూ హింట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ వారం హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు గుడ్‌బై చెప్పారు. మొదటగా ఫ్లోరా సైనీ ఓటింగ్ పరంగా ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత డేంజర్ జోన్లో ఉన్న రీతూ, డీమాన్, సుమన్ శెట్టి, సంజన, శ్రీజ లకు నాగార్జున టాస్క్‌లు ఇచ్చారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో వచ్చిన కంటెస్టెంట్లను కూడా ఈ టాస్క్‌ల్లో భాగం చేశారు.
మొదట సంజన సేఫ్ కాగా, ఆ తర్వాత రీతూ, డీమాన్ కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరిగా సుమన్ శెట్టి, శ్రీజ మిగిలారు. అప్పుడు నాగార్జున మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలనే పవర్‌ను వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ల చేతిలో పెట్టారు. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన ఆరుగురు వైల్డ్‌కార్డ్స్‌లో నలుగురు శ్రీజ ఎలిమినేట్ కావాలని ఓటేశారు. కేవలం గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ మాత్రమే శ్రీజకు సపోర్ట్ చేశారు. ఈ నిర్ణయం చూసి హౌస్మేట్స్, ప్రేక్షకులందరూ షాక్ అయ్యారు. వైల్డ్‌కార్డ్స్‌లో భాగంగా వచ్చిన దివ్వెల మాధురి – శ్రీజ మధ్య జరిగిన గొడవ కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపిందని హౌస్ టాక్. మాధురి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే శ్రీజతో వాగ్వాదం జరగడంతో, ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో మాధురి సహా పలువురు వైల్డ్‌కార్డ్స్ శ్రీజకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.