తిరుపతి : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో (Tirupati) టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని డాకు మహారాజ్ ( Daku Maharaj ) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది . సంక్రాంతి పండుగకు బాలకృష్ణ (Balakrishna) నటించిన డాకు మహారాజు సినిమా ఈనెల 12 విడుదల కానుంది.
సితార బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగితం వహించారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా 40 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ తిరుపతిలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమనిపేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.