అగ్ర నటుడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి దాదాపు 300కోట్లకుపైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రాన్ని పూర్తి చేశారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు-సురేష్‌బాబు సంయుక్తంగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారని, వచ్చే వేసవిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తున్నది.