సీనియర్ నిర్మాత, దర్శకుడు సీవీ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ‘ఆఖరి ముద్దు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. చిత్ర విశేషాలను సీవీ రెడ్డి తెలియజేస్తూ ‘ ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. సమాజానికి మంచి సందేశం అందించే కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం అందర్ని ఆలోచింపజేసే విధంగా వుంటుంది. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది’ అన్నారు.