Thalapathy Vijay | భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌ని గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హర్మన్ ప్రీత్ కౌర్‌ని పిలిచారు.
అయితే ఈ వేడుకలో హర్మన్ మాట్లాడుతూ.. విజయ్ – అట్లీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బిగిల్’లోని
ఫేమస్ డైలాగ్ “కప్పు ముఖ్యం బిగిలే!” (కప్పు ముఖ్యం బిగిల్!) అనే డైలాగ్‌ని కొట్టింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా చప్పట్లతో కేరింతలు కొట్టారు. తన రాబోయే టోర్నమెంట్లలో తమ జట్టుకు విజయం ఎంత ముఖ్యమో సూచించడానికి సరదాగా ఈ డైలాగ్ కొట్టినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.