Critics Choice Awards 2025| సినీరంగంలో ప్రెస్టీజియస్‌గా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక అమెరికాలో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుకలో భారతీయ చిత్రాలు నిరాశ పరిచాయి. సమంత నటించిన సిటాడెల్ (Citadel) సిరీస్‌తో పాటు పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ఆల్ వి ఇమాజిన్ ఆస్ లైట్(All We Imagine As Light) చిత్రాలు ఈ అవార్డులకు నామినేట్ అవ్వగా.. ఈ రెండు చిత్రాలు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఆల్ వి ఇమాజిన్ ఆస్ లైట్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేట్ అవ్వగా.. సమంత సిటాడెల్ ఉత్తమ విదేశీ భాషా సిరీస్ విభాగంలో నామినేట్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాలను వెనక్కి నెట్టేసి ‘ఎమిలియా పెరెజ్’, ‘స్క్విడ్ గేమ్ 2’ చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో అనోరా చిత్రం అవార్డును అందుకోగా.. ఉత్తమ నటిగా ది సబ్ స్టాన్స్ సినిమాకు గాను డెమి మూర్ ఈ అవార్డును అందుకుంది. మరోవైపు అమెరికన్ సిరీస్ ‘షోగన్’ సిరీస్ ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ ఏడాది క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల అందుకున్న జాబితా చూసుకుంటే.
ఉత్తమ చిత్రం – అనోరా
ఉత్తమ నటుడు – అడ్రియన్ బ్రాడీ – (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి – డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి – జో సల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ యువ నటుడు/నటి – మైసీ స్టెల్లా (మై ఓల్డ్ యాస్)
ఉత్తమ నటన సమిష్టి – కాన్క్లేవ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ – జారిన్ బ్లాష్కే – నోస్ఫెరాటు
ఉత్తమ ఎడిటింగ్ – మార్కో కోస్టా – ఛాలెంజర్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – ది వైల్డ్ రోబోట్
ఉత్తమ కామెడీ – ఎ రియల్ పెయిన్ అండ్ డెడ్‌పూల్ & వుల్వరైన్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం – ఎమిలియా పెరెజ్
ఉత్తమ దర్శకుడు – జాన్ ఎం. చు – వికెడ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – కోరలీ ఫార్గేట్ – ది సబ్‌స్టాన్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – పీటర్ స్ట్రాఘన్ – కాన్క్లేవ్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – నాథన్ క్రౌలీ, లీ సాండల్స్ – వికెడ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టేజ్‌వెల్ – వికెడ్
ఉత్తమ హెయిర్ అండ్ మేకప్ – ది సబ్‌స్టాన్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – పాల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, రైస్ సాల్కోంబ్, గెర్డ్ నెఫ్జర్ – డ్యూన్: పార్ట్ టూ
ఉత్తమ పాట – ఎల్ మాల్ – ఎమిలియా పెరెజ్ – జో సల్దానా, కార్లా సోఫియా గాస్కాన్, కామిల్లె
ఉత్తమ స్కోర్ – ట్రెంట్ రెజ్నోర్ & అట్టికస్ రాస్ – ఛాలెంజర్స్
ఉత్తమ డ్రామా సిరీస్ – షోగన్ (FX / హులు)
ఉత్తమ విదేశీ భాషా సిరీస్ – స్క్విడ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ యానిమేటెడ్ సిరీస్ – X-మెన్ ’97 (డిస్నీ+)
ఉత్తమ టాక్ షో – జాన్ ములానీ ప్రెజెంట్స్: ఎవ్రీబడీస్ ఇన్ L.A. (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ కామెడీ స్పెషల్ – అలీ వాంగ్: సింగిల్ లేడీ (నెట్‌ఫ్లిక్స్)