Drishyam 3 | దృశ్యం 3 తెలుగు వెర్షన్‌పై డైరెక్టర్ జీతూజోసెఫ్ గుడ్‌న్యూస్..!
Drishyam 3 | దృశ్యం ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. రెండు పార్టులను తెరకెక్కించిన ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని కూడా తెరకెక్కిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ , మీనా కాంబోలో వస్తోన్న దృశ్యం 3 మే 21న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Drishyam 3 | మాలీవుడ్ నుంచి రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ప్రాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది దృశ్యం (Drishyam). జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాంచైజీ క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కగా.. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంచైజీలోమరోసారి దృశ్యం 3 (Drishyam 3) కూడా వస్తుందని తెలిసిందే.
దృశ్యం ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. రెండు పార్టులను తెరకెక్కించిన ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని కూడా తెరకెక్కిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ , మీనా కాంబోలో వస్తోన్న దృశ్యం 3 మే 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో వెంకటేశ్, మీనా కాంబోలో రావాల్సిన దృశ్యం 3 సినిమా వెంకీ బిజీ షెడ్యూల్స్ వల్ల తెరకెక్కించడం లేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే వెంకీ దృశ్యం 3 కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు నిరాశ మిగిలింది. వారి కోసం డైరెక్టర్ జీతూ జోసెఫ్ గుడ్‌న్యూస్ అందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్‌చాట్ సెషన్లో దృశ్యం 3 మలయాళ వెర్షన్‌తోపాటు మే 21నే తెలుగు, తమిళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లు కూడా విడుదలవుతాయని చెప్పాడు. మొత్తానికి తెలుగు రీమేక్ లేకున్నా డబ్డ్ వెర్షన్ వస్తుండటంతో కొంత రిలీఫ్ అవుతున్నారు మూవీ లవర్స్.
కాగా హిందీలో అజయ్ దేవ్గన్, శ్రియా కాంబోలో దృశ్యం 3 కూడా తెరకెక్కుతుండగా.. ఈ మూవీని 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంటే ఒరిజినల్ (మలయాళం) వెర్సన్ రిలీజైన 6 నెలల తర్వాత హిందీలో రాబోతుందన్నమాట.
Read Also :
I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేశ్ చందల్‌కు బెయిల్ మంజూరీ
JD Chakravarthy | ‘కల్కి 2’లో జేడీ చక్రవర్తి?.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
Supreme Court | ‘వారి కోసం చట్టాలను సవరించండి’.. బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

