Sukku-Ram charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘పెద్ది’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అంచనాలు తారాస్థాయిలో ఉంటే, అదే బ్యానర్‌పై రామ్ చరణ్ తర్వాత చేస్తున్న RC17 ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు… సుకుమార్! ఈ కాంబినేషన్ అంటేనే ఆడియెన్స్‌కి వెంటనే రంగస్థలం గుర్తొస్తుంది. “చిట్టి బాబు” పాత్రలో చరణ్ చూపిన మ్యాజిక్కి అప్పట్లో విమర్శకులు, ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు అదే కాంబో మళ్లీ రిపీట్ కావడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. టాలీవుడ్లో ఒకప్పుడు కౌబాయ్ జానర్‌కు మంచి మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గినా, సుకుమార్ – చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా మళ్లీ ఆ జానర్‌ను రీడిఫైన్ చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ హార్స్ రైడింగ్‌లో దిట్ట అనే విషయం తెలిసిందే. ఈ టాలెంట్‌ను సుకుమార్ ఫుల్‌గా ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఫైనల్ కాస్టింగ్ ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’తో సుకుమార్ చూపించిన మాస్ రేంజ్‌కి, రామ్ చరణ్ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ క్రేజ్‌కి ఈ కాంబినేషన్ జతకావడం అంటేనే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాపిక్ అవుతుంది. ‘పెద్ది’తో మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన చరణ్, RC17తో పాన్ వరల్డ్ రేంజ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. సుకుమార్ కూడా ఈ కథను పూర్తిగా విభిన్నంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేషన్‌పై అభిమానులే కాదు, ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు, ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి టాలీవుడ్లో మరో మాస్ రాంపేజ్ మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.