Aadipurush | ఆదిపురుష్ విడుదల తేదీలో మార్పు.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ (Aadipurush) టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ అభిమానుల్లో నిరాశ కలిగించే గాసిప్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటిస్తోన్న మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్ (Aadipurush). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut)దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ అభిమానుల్లో నిరాశ కలిగించే గాసిప్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఆదిపురుష్ అనుకున్న డేట్‌కు కాకుండా ముందుకానీ, తర్వాత కానీ విడుదల కానుందంటూ ఓ వార్త నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. తాజా గాసిప్ ప్రకారం ఆదిపురుష్ జనవరి మొదటి వారంలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. మరి విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలు నిజమేనా..? వట్టి పుకార్లు మాత్రమేనా అనే దానిపై మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోండగా… సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా కనిపించబోతున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, హనుమంతుడి పాత్రలో దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు. ఆది పురుష్ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సాచెట్-పరంపర మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

