Jacqueline Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు తేల్చనున్నది. రూ.200కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నట్లు నటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మనీలాడరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటికి ఇటీవల ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ గడువు ముగియడంతో గురువారం ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరైంది. కేసులో రెగ్యులర్ బెయిల్‌తో పాటు ఇతర పెండింగ్ దరఖాస్తులపై కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా నటి బెయిల్ గడువును పెంచొద్దని, లేదంటే దేశాన్ని విడిచి వెళ్లే అవకాశం ఉందని ఈడీ ఆరోపించింది.
విచారణకు సహకరించలేదని పేర్కొంది. అయితే, కేసులో నిందితులుగా ఉన్న కొందరు జైలులో ఉన్నారని, మరెందుకు నటిని అరెస్టు చేయలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఈడీ ప్రశ్నించింది. అయితే, జాక్వెలిన్ బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. జాక్వెలిన్ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే.. అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉన్నది. రూ.200కోట్ల మనీలాండింగ్ వ్యవహారంలో ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయని, రూ.7కోట్ల వరకు అతని నుంచి జాక్వెలిన్ బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోర్టు సినీ నటికి బెయిల్ ఇస్తుందా? ఈడీకి అనుకూలంగా తీర్పు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.