హీరో నాని సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ నెల 14న విడుదలకానుంది.
బుధవారం ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పొక్సో చట్టం నేపథ్యంలో సంక్లిష్టమైన సామాజిక సమస్యను చర్చించే చిత్రమిదని, సందేశాత్మకంగా ఉంటుందని, ఈ నెల 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. శివాజీ, సాయికుమార్, హర్ష్ రోషన్, శ్రీదేవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణ సంస్థ: వాల్‌పోస్టర్ సినిమా, కథ, దర్శకత్వం: రామ్ జగదీష్.