Coolie | రజనీకాంత్ లీడ్ రోల్ లో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం కూలీ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడు చరిత్రలోనే ఈ మూవీ భారీ ఓపెనింగ్ రాబట్టే సినిమా అని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకుంటున్నారు. పాజిటివ్ టాక్ వస్తే.. రజనీకాంత్ మేనియా ముందు పోటీలో ఉన్న “వార్ 2” వంటి సినిమాలు కూడా ఏమాత్రం నిలబడలేవని అభిమానులు విశ్వసిస్తున్నారు. కోలీవుడ్ చిత్రరంగంలోనే కూలీ మొదటిసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్న చిత్రం అనే నమ్మకంతో ఈ సినిమా పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
అయితే భారీ బజ్ సెట్ చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా, సన్ పిక్చర్స్ కూలీ చిత్రంకి సంబంధించి ఎలాంటి టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయకుండా డైరెక్ట్‌గా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటుందట. ఇదే నిజమైతే మాత్రం రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ నిర్ణయంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు సన్ పిక్చర్స్ బృందం మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాంబో ఉన్నప్పుడు ప్రచారం అవసరం లేదేని మేకర్స్ భావిస్తున్నారట.
ట్రైలర్ అన్నది సినిమా పట్ల భోజనానికి ముందు పెట్టే సలాడ్ లాంటిది, అంటే ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ను మరింత పెంచుతుంది. కానీ, కూలీ టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడం వెనుక సన్ పిక్చర్స్ సాహసోపేత నిర్ణయమే తీసుకుంటుంది అని అంటున్నారు. ఇక కూలీ కోసం జూలై నెలాఖరున చెన్నై నెహ్రు స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలో టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందా అన్నది చూడాలి. మరోవైపు, ఆగస్ట్ 7 హైదరాబాద్ లో కూడా ఒక వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే చిత్రానికి తగిన ప్రమోషన్ ఉండాలి అని వారు అభిప్రాయపడుతున్నారు.