NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డెడికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గత రాత్రి జరిగిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. అయితే ఆయన గాయంతో బాధపడుతున్నప్పటికీ హాజరు కావడం విశేషం. స్టేజ్‌పైకి వచ్చినప్పుడు నొప్పి కారణంగా కొంత అన్‌కంఫర్టబుల్‌గా కనిపించిన ఎన్టీఆర్, ఎక్కువ సేపు నిలబడలేను, కాస్త నొప్పిగా ఉంది. మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడటం అక్కడివారిని ఎమోషనల్‌కి గురిచేసింది. ఈవెంట్లో తన కుడి భుజం కింద పదే పదే తడుముతూ మాట్లాడిన ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ వైపు ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతుండగా, మరోవైపు ఆయన డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. గాయం ఇబ్బంది పెట్టినా రిషబ్ శెట్టి కోసం ఈవెంట్‌కు హాజరయ్యారని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇటీవల యాడ్ షూట్లో ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, నిర్మాతకు నష్టం రాకూడదన్న ఉద్దేశంతో మరుసటి రోజే షూట్‌కు హాజరై తన పార్ట్ పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్న ఆయన, రిషబ్ ప్రాజెక్ట్ కోసం మాత్రం హాజరయ్యారు. దీనిపై ఫ్యాన్స్ “దటీజ్ ఎన్టీఆర్” అంటూ మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి డ్రాగన్ సినిమా చేస్తున్నారు. గాయం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, ఈవెంట్లో ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ త్వరలోనే షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఆలస్యం అవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. అయినప్పటికీ, అభిమానులు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాలని కోరుతున్నారు. గాయం ఉన్నా, ఫ్రెండ్ కోసం హాజరైన ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు గర్వపడుతున్నారు. మరి ఆయన త్వరగా కోలుకుని డ్రాగన్ షూటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.