Karthik Varma Dandu | ‘విరూపాక్ష’ చిత్రంతో టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హర్షితతో ఆయన నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నాగ చైతన్య – శోభిత ధూళిపాళ దంపతులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మెగా హీరో సాయి దుర్గ తేజ్, అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
వధూవరులను ఆశీర్వదిస్తూ తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుకుమార్ దర్శకత్వ విభాగంలో పని చేసిన కార్తీక్, ‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం యువసామ్రాట్ నాగ చైతన్యతో ‘NC 24’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో చైతూకి మరో మంచి హిట్ ఇస్తాడని ముచ్చటించుకుంటున్నారు.
ఇక కార్తీక్ వర్మ దండు నిశ్చితార్థ వేడుకతో పాటు, ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “క్రియేటివ్ డైరెక్టర్‌కు పర్సనల్ లైఫ్‌లో కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం” అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ దర్శకుడి పెళ్లి తేది ఎప్పుడు అనే దానిపై క్లారిటీ అయితే రావలసి ఉంది.
Supreme Hero brings a special vibe to #KarthikHarshitha‘s engagement!
Fun and favorite moments as @IamSaiDharamTej joins his #Virupaksha director @karthikdandu86 – Harshita at the engagement ceremony❤️#SaiDurghaTej wishes the couple a lifetime of love and happiness!✨️… pic.twitter.com/xBuKf9Va7u
— Beyond Media (@beyondmediapres) September 28, 2025
♥️❤️🔥 pic.twitter.com/k3OiTEAlZD
— ChayAkkineni_Fc (@ChayAkkineniFc) September 28, 2025