Edupayala | మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో (Edupayala) శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సరస్వతి దేవి రూపంలో వనదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వనదుర్గ ఆలయం వద్ద మంజీర ప్రవాహం కొనసాగుతున్నది. వనదుర్గ ఆనకట్ట నుంచి 1,06,126 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గర్భగుడి ముందు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఏడుపాలయ మొదటి, రెండో, మూడో బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో నదీ ప్రవాహం ఉన్నది. మరోవైపు ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద కూడా మంజీరా ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది.