Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల షేర్ సాధించింది. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ, సాహో తో కనెక్ట్ అవుతూ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తోంది. సినిమా చివర్లో ఓజీ 2 అనౌన్స్ చేయడం అభిమానుల్లో ఉత్సుకత రేపింది. రెండో భాగంలో ఓజీ జపాన్‌లో చేసిన మిషన్, అక్కడ గ్యాంగ్‌ను ఎలా అంతం చేశాడనే కథ ఉంటుందని టాక్. అంతేకాదు, సుభాష్ చంద్రబోస్ కథను కూడా ఈ ప్లాట్‌లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.
సినిమాలో ఓజీ తల్లిదండ్రుల ఫోటోను చూపించారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ పక్కన కనిపించిన వ్యక్తి రాంచరణ్ లాగే ఉన్నారని ఫ్యాన్స్ భావించారు. దీంతో “చరణ్ నిజంగానే సినిమాలో ఉన్నారా?” అనే చర్చ మొదలైంది. దీనిపై డైరెక్టర్ సుజీత్ క్లారిటీ ఇస్తూ.. “ఆ ఫోటోలో రాంచరణ్ కాదు, అది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఆయనకి కొత్త లుక్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ డిజైన్ చేశాం. మెగా ఫ్యామిలీలో పోలికలు సహజం. కళ్ళలో పవర్ ఫుల్ లుక్ ఉండటం వల్లే చరణ్ లాగా అనిపించింది అని వెల్లడించారు. సుజీత్ వివరణ ఇచ్చినా, అభిమానులు మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాంచరణ్ లుక్ వాడారని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, ఇంత స్పష్టమైన పోలిక యాదృచ్ఛికం కాదని వారు అంటున్నారు.
ఇకపోతే, సుజీత్ – రాంచరణ్ కాంబినేషన్ సినిమా సాహో తర్వాతే రావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ప్రస్తుతం ఓజీ విజయంతో మళ్లీ ఆ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది. ఇక ఓజీ విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో మెరిశారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.