ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Dec 15, 2020 , 10:59:29

విజేత‌గా నిలిచేందుకు అర్హులు ఎవ‌రు, అన‌ర్హులు ఎవ‌రు?

విజేత‌గా నిలిచేందుకు అర్హులు ఎవ‌రు, అన‌ర్హులు ఎవ‌రు?

బిగ్ బాస్ విజేత కావడానికి మీరే ఎందుకు అర్హులో తెలియజేస్తూ.. విజేత కావడానికి అర్హతలేని ఒక సభ్యుడ్ని ఎంచుకుని సరైన కారణాలను తెలియజేయాలని ఆదేశించారు బిగ్ బాస్. ముందుగా మాట్లాడిన అభిజీత్.. ఎక్కువ సార్లు నామినేట్ అయ్యా అలానే సేవ్ అయ్యాను. విజేత‌గా నేను అర్హుడిని అనుకుంటున్నాను. హారిక అన‌ర్హురాలు అనిపిస్తుందని చెప్పాడు. ఇక అఖిల్ ..బిగ్ బాస్ విజేత‌కు నేను అర్హుడిని అనుకుంటున్నాను. మైండ్ గేమ్‌తో ఆడుతూ ఎవ‌రిని హ‌ర్ట్ చేయ‌కుండా ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్ గా వ‌చ్చాను. ఇక అన‌ర్హురాలు అంటే  అరియానా పేరు చెబుతాను. తాను టాస్క్ ల‌లో ఒక్కోసారి లిమిట్స్ దాటుతుందని అన్నాడు అఖిల్ 

బిగ్ బాస్ విజేత కావాలి అంటే దిల్‌, మైండ్ బ్యాలెన్స్ చేస్తూ గేమ్ ఆడాలి. బ‌య‌ట ఉన్న‌ట్టే ఇక్క‌డ కూడా ఉన్నా. అందుకే నేను విజేతగా అర్హుడిని అనుకుంటున్నారు. అరియానా అన‌ర్హురాలు అని నా ఫీలింగ్ అంటూ సోహైల్ చెప్పుకొచ్చాడు. అభి కూడా టాస్క్‌ల‌లో ఎఫ‌ర్ట్ ఎక్కువ పెట్టి ఆడితే బాగుండు అని అనిపిస్తుంది. ఇత‌ను కూడా నా దృష్టిలో అన‌ర్హుడు అనిపిస్తుందని సోహైల్ స్ప‌ష్టం చేశాడు . ఇక హారిక మాట్లాడుతూ.. నేను కత్తిని వాడా.. పూవుని వాడా.. రెండింటినీ బ్యాలెన్స్ చేశా. అందరితోనూ మంచి బ్యాలెన్స్ చేస్తా. వందశాతం ఎఫర్ట్ ఇచ్చా.నేను సూప‌ర్ ప‌ర్‌ఫెక్ట్ కాబ‌ట్టి విన్న‌ర్ అవ‌డానికి అర్హ‌త నాలో ఉంది. అరియానా అన‌ర్హురాలు అనిపిస్తుందని పేర్కొంది హారిక.

VIDEOS

logo