Constable Kanakam 2 | మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఈ బెంగళూరు భామ టైటిల్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం (Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు.
క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుండగా అద్భుతమైన స్పందన వచ్చింది. 1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లెలో అడవి గుట్ట, మహిళల మిస్సింగ్ నేపథ్యంలో ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ ప్రాజెక్ట్ క్లైమాక్స్‌లో సెకండ్ సీజన్ ఉండబోతుందని హింట్ ఇచ్చింది. అంతా అనుకున్నట్టుగా ఇక సీజన్ 2 కూడా వచ్చేస్తుంది.
కానిస్టేబుల్ కనకం 2 వచ్చే నెలలో విడుదల కానుంది. డబుల్ ఫైర్‌తో కానిస్టేబుల్ కనకం తిరిగి రాబోతుంది..అని ట్వీట్ చేశారు మేకర్స్. త్వరలోనే అధికారిక విడుదల ఎప్పుడనేది స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్టులో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, కంచరపాలెం కిశోర్, జ్వాల కోటి, రాకేందు మౌళి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. మరి రెండో పార్ట్ ఎలాంటి ట్విస్టులతో ఉండబోతుందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
You’re rewatching. We’re watching you. 👀
Get ready Kanakam returns next month with double the fire! 🔥🚔#ConstableKanakam pic.twitter.com/hdcEv8cejj— ETV Win (@etvwin) November 4, 2025
NC 24 | నాగచైతన్య – మీనాక్షి చౌదరి జంటగా ‘NC24’ ..ఆసక్తి రేపుతున్న దక్ష లుక్