సాయి పల్లవి నటనతోనే కాదు ఆట పాటలతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా, మారి 2 చిత్రాలలోని సాంగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా పాటతో రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళుతుండగా, ఇప్పుడు ఈ సాంగ్ మరో మైల్ స్టోన్‌ను టచ్ చేసింది.
సాయి పల్లవిపై సెట్ చేసిన స్పెషల్ సాంగ్ “సారంగ దారియా” పాట 150 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి సౌత్ ఇండియన్ సినిమాలో మరో రికార్డు సెట్ చేసింది. రానున్న రోజులలో మరిన్ని వ్యూస్ రాబట్టడం ఖాయంగా తెలుస్తుంది. నాగ చైతన్య ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రం గత వారంలో విడుదల కావలసి ఉండగా, కరోనా వలన ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Conquered 150M hearts 💕 and still counting..
— Aditya Music (@adityamusic) April 23, 2021
►https://t.co/4Q16GiS2er@Sai_Pallavi92 + @sekharkammula combo never fails to Fidaa us❣️⚡@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP @pawanch19 #Suddalaashokteja @iamMangli #AmigosCreations @AsianSuniel @adityamusic pic.twitter.com/u3kg8wCb7K