కథల ఎంపికలో కథానాయకుడు శ్రీవిష్ణు పంథా వేరు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్‌కి చక్కని వినోదాన్ని పంచే కథలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ వినోదమే శ్రీవిష్ణుని సక్సెస్ఫుల్ హీరోని చేసింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. పేరు చూసి.. ఇదేదో వామపక్షభావాలతో కూడిన విప్లవాత్మక చిత్రమని అందరూ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పూర్తి స్థాయి వినోదాత్మకంగా, శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ఈ సినిమా ఉండబోతున్నది.
విశేషమంటంటే.. ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తి అభిమానిగా శ్రీవిష్ణు కనిపించబోతున్నారు. నారాయణమూర్తి సినిమాలు చూస్తూ.. ఆయన సినిమాలను థియేటర్లలో ఆడిస్తూ పెరిగిన కుర్రాడి కథ ఇది. అలాంటి కుర్రాడు నక్సలైట్‌గా ఎలా మారాడు అనేదే ఇందులో ఆకస్తికరమైన అంశం. జానకిరామ్ మారెళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.