Dil raju profits | టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఈయన అరడజనకు పైగా సినిమాలను నిర్మిస్తున్నాడు. జెర్సీ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. ఒకవైపు నిర్మాతగా రాణిస్తూనే.. మరోవైపు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈయన రెండు పెద్ద సినిమాలను నైజాం నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. అవే అఖండ, పుష్ప. ఈ రెండు సినిమాలకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీటిలో ఏ సినిమాతో దిల్ రాజు ఎక్కువ లాభపడ్డాడో తెలుసా ! బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకే లాభాలు ఎక్కువ వచ్చాయంట. ఇవి పుష్ప సినిమాకు వచ్చిన ప్రాఫిట్స్తో పోలిస్తే రెట్టింపు అని తెలుస్తోంది.
ప్రస్తుతం దిల్ రాజు రెండు భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. వీటిలో ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15, తమిళ హీరో విజయ్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు దిల్ రాజు. వీటితో పాటు అల్లరి నరేశ్ నటించిన నాంది, విశ్వక్సేన్ నటించిన హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. ఎఫ్ 3, జెర్సీ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి