Committee Kurrollu | టాలీవుడ్ యువ నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక కొణిదెల సమర్పణలో… పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ వదిలిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. 1990 నేపథ్యంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుత జనరేషనలో యూత్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఇక మూవీలో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.
సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.