Comedian | ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ కమెడీయన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. ఆయన తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా కిశోరే కనిపిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉ ఉన్న వెన్నెల కిషోర్ రీసెంట్గా ‘#సింగిల్’ సినిమాతో థియేటర్లలోకి వచ్చి తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో కిషోర్ కీలక పాత్ర నటించగా, తన కామెడీతో తెగ వినోదం పంచాడు. సింగిల్ చిత్రం మంచి హిట్ అయిన నేపథ్యంలో వెన్నెల కిషోర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు.
వెన్నెల కిషోర్ హీరోలకు సమానంగా కొన్ని సినిమాలలో నటించి మెప్పిస్తున్నాడు. వెన్నెల కోశోర్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో పక్కన నటించాలంటే తనను సర్జరీ చేసుకోవాలని ఓ దర్శకుడు చెప్పారని స్పష్టం చేశాడు. మరి ఆ హీరో మహేష్ బాబు కాగా, దర్శకుడు శ్రీను వైట్ల. దూకుడు సినిమా సమయంలో వెన్నెల కిషోర్ కాస్త బొద్దుగా ఉండేవాడట. మహేష్ బాబు ఫ్రెండ్ పాత్ర కోసం వెన్నెల కిషోర్‌ని ఎంపిక చేశారు. అయితే మహేష్ పక్కన ఫ్రెండ్‌గా నటించడానికి నన్ను లైపో సర్జరీ చేయించుకోమన్నారు దర్శకుడు శ్రీను వైట్ల
మహేష్ బాబు స్లిమ్ గా ఫిట్ గా ఉంటారు. ఆయన పక్క ఫ్రెండ్స్ కూడా స్లిమ్ గా ఉండాలని చెప్పిన శ్రీను వైట్ల నన్ను సర్జరీ చేయించుకోమని సూచించారు. కాని తర్వాత కొన్ని షాట్స్ చూశాక ఇలానే బాగుంది వద్దులే అని చెప్పారట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశాడు వెన్నెల కిషోర్. మహేష్ బాబు, వెన్నెల కిషోర్ కాంబోలో దూకుడు, ఆగడు, బ్రహ్మోత్సవం, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.