Mass Jathara | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటించిన మాస్ జాతర (Mass Jathara) థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ రైల్వే పోలీసాఫీసర్‌గా నటించాడు. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొదట ఈ చిత్రంలో కమెడియన్స్ సత్య, గెటప్ శ్రీను నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ పోస్టర్ల ద్వారా తెలియజేశారు. అయితే ఫైనల్ కట్ వచ్చే సరికి మాత్రం వారి సన్నివేశాలు మిస్సయ్యాయి. ముందుగా మేకర్స్ 160 నిమిషాల రన్‌టైం ప్లాన్ చేశారట. అయితే ఆ తర్వాత ఈ నిడివిని 144 నిమిషాలకు ట్రిమ్ చేశారు.
రవితేజ ఎంటర్టైనింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సత్యలాంటి పర్ఫెక్ట్ కామిక్ స్టైల్ ఉన్న కమెడియన్ సన్నివేశాలుంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ మేకర్స్ ఫైనల్ కట్లో సత్య, గెటప్ శీను సీన్లు ఎందుకు ట్రిమ్ చేశారనేది సస్పెన్స్ నెలకొంది.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కించారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
Janhvi Kapoor | రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
Dil Raju | సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు .. క్రేజీ అప్డేట్ ఏంటంటే..!
Mass Jathara Review | ‘మాస్ జాతర’ రివ్యూ.. రవితేజ కొత్త మూవీ ఎలా ఉందంటే.?