గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా నాయిక. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత నవ్వులు ఉంటాయి అంటున్నారు కీలక పాత్రలో నటించిన ప్రవీణ్. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…‘దర్శకుడు మారుతి నన్ను కమెడియన్‌గా నిలబెట్టాడు. నా పేరుతోనే క్యారెక్టర్స్ రాసి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన సీన్స్‌లో నటిస్తుంటే నవ్వుతుంటాడు. ఆ నవ్వే చాలా కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. మనం బాగా నటిస్తున్నామని అనుకునేలా చేస్తుంది.
ఈ చిత్రంలోనూ ప్రవీణ్ అనే పాత్రలో కనిపిస్తా. హీరో గోపీచంద్‌కు కోర్టులో ఫైల్స్ అందిస్తూ హెల్ప్ చేస్తుంటా. ‘వాంటెడ్’, ‘మొగుడు’ చిత్రాల తర్వాత ఆయనతో కలిసి నటించిన చిత్రమిదే. మారుతి చిత్రాల తరహా వినోదం ఇందులోనూ చూస్తారు. సినిమాలో కావాల్సినంత వినోదం గ్యారెంటీ అని చెప్పగలను. జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ వల్ల ప్రతివారం ఇండస్ట్రీకి ఒక కొత్త కమెడియన్ వస్తున్నాడు. హాస్యనటుల్లో పోటీ బాగా పెరిగింది. ఇప్పటికి నాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. లేని రోజు ఏం చేయాలని ఆలోచిస్తా. కోట శ్రీనివాసరావులా విలన్, కమెడియన్ చేయొచ్చు. అయితే నేను విలన్‌గా నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం రవితేజతో ‘రావణాసుర’, ‘ధమాకా’, అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను’ అన్నారు.