నిర్మాతగా కమెడియన్ అలీ..ప్రభాస్ సాయం
తెలుగు ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 900 సినిమాల్లో నటించాడు ఈయన.

తెలుగు ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 900 సినిమాల్లో నటించాడు ఈయన. కేవలం నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా ఆలీకి చాలా మంచి పేరు ఉంది. అందరితో కలిసి మెలిసి ఉండడం ఈయన ప్రత్యేకత. అందుకే ఈయన కోసం హీరోలు కూడా దేనికైనా సిద్ధమే అంటారు. ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సై అంటారు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు అలీ. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ నిర్మాతగా మారలేదు ఈయన. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తొలిసారి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. స్వయంగా అలీ నిర్మాతగా మారి ఒక సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’.
మలయాళంలో మంచి విజయం సాధించిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అలీ. ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ అలీవూడ్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో అలీతో పాటు సీనియర్ యాక్టర్ నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను రంగంలోకి దింపుతున్నాడు అలీ.
ప్రభాస్ తో అలీకి మంచి అనుబంధముంది. బిల్లా సినిమాలో ఇద్దరు స్నేహితులుగా నటించారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ సాయం తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను జూన్ 25 సాయంత్ర 4:05కు రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఈ పాటను ప్రభాస్ విడుదల చేయబోతున్నాడు. మరి నటుడిగా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న అలీ..ఈ సినిమాతో నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రొమాంటిక్ గా ఫిల్హాల్ 2 మ్యూజిక్ వీడియో పోస్టర్
రాజమౌళి కథ చెప్తే..పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..?
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

