CM Revanth Reddy | సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతీ సినిమా థియేటర్లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలకు సూచనలు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ (Drug Free Telangana) లో భాగస్వాములుగా ముందుకొచ్చిన భారతీయుడు 2 చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ.. భవిష్యత్‌ను అంధకారం చేసే డ్రగ్స్‌కు దయచేసి నో చెప్పండి.. అంటూ డైరెక్టర్ శంకర్, యాక్టర్లు కమల్ హాసన్, సముద్రఖని, సిద్దార్థ్ టీం రూపొందించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ, సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయమంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024