తెలుగు రాష్ర్టాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ పాటించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించిన చెల్లింపులు.. అద్దె ప్రతిపాదికన కాకుండా షేర్ పద్ధతిలోనే జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించని పక్షంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ర్టాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మూసివేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్జిబిటర్లు ప్రకటించారు.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు, అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబుతో సహా 60మందికిపైగా ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని సినిమా థియేటర్ల పరిస్థితి, అద్దె విధానంతో నష్టాలు, పర్సంటేజీల విధానం.. తదితర అంశాలపై ఈ సమావేశంలో సుధీర్ఘ చర్చ జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్సంటేజ్ విధానం వల్ల మాత్రమే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుందని, ఆ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లందరూ తీర్మానించారు.
ఇదిలావుంటే.. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య పర్సంటేజీలపై చాలాకాలంగా చర్చ నడుస్తున్నది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యంకాదని ఎగ్జిబిట్లర్లు అంటుంటే.. పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు తలనొ ప్పిగా మారిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. త్వరలోనే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ సమావేశం ఏర్పాటు చేసి, ఎగ్జిబిటర్ల సమస్యలకు సరైన పరిష్కాలను అన్వేషిస్తామని సమావేశానంతరం అగ్ర నిర్మాతలు దిల్‌రాజు, డి.సురేశ్‌బాబు పేర్కొన్నారట.
1వ వారం: 25శాతం (ఎగ్జిబిటర్ షేర్)
2వ వారం: 45శాతం
3వ వారం: 60శాతం
1వ వారం: 40శాతం
2వ వారం: 50శాతం
3వ వారం: 60శాతం
1వ వారం: 50 శాతం
2వ వారం: 60 శాతం
మిగిలిన వారాలు 70శాతం.