komatireddy venkat reddy | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్స్ బంద్ చేయడం సరికాదని కార్మికులకు సూచించారు. పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో నిర్మాతలు, కార్మికులకు మధ్య వివాదంపై చర్చించినట్టు సమాచారం. కార్మికుల బంద్ నేపథ్యంలో అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. సమావేశంలో బాపినీడు, సుప్రియ, జెమినీ కిరణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.
వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారని తెలిసిందే. కార్మికులు మరోవైపు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. దీంతోపాటు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై మరోవైపు నిర్మాతలు చిరంజీవితో సమావేశమై చర్చలు కూడా జరిపారు.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
Madharaasi | శివకార్తికేయన్ నయా అవతార్.. మదరాసి మేకింగ్ వీడియో వైరల్
Baaghi 4 Teaser | టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ టీజర్ విడుదల